TS News: తెలుగు సినీ పరిశ్రమపై మంత్రి తలసాని కీల వ్యాఖ్యలు

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022 : తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేశారు. అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ మళ్లీ పుంజుకుందన్నారు. తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచామని.. ఐదో ఆటకు కూడా అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. సినిమాకు కులం, మతం, ప్రాంతాలు ఉండవని.. ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమే సినిమా అని అభిప్రాయపడ్డారు. "ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్ల సమస్యలపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడతాను. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలనేదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష. పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారు. అందుకే సినీ పరిశ్రమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. పరిస్థితులకు అనుగుణంగా, సందర్భానుసారంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితులు ఉదృతంగా ఉంటే ఆంక్షలు తప్పవు. త్వరలోనే ఆన్ లైన్ టికెట్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం" అని తలసాని పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us