TS News: కొనసాగుతోన్న స్టాలిన్‌, కేసీఆర్‌ భేటీ.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. తమిళనాడు పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ నిన్న శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. రాత్రికి చెన్నైలో బస చేశారు. ఇవాళ అక్కడే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో కేసీఆర్ సమావేశం అయ్యారు. జాతీయ, రాజకీయ పరమైన అంశాలు, పాలనాపరమైన విషయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. చెన్నైలోనే ఉన్న రాష్ట్ర మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్‌ను కూడా సీఎం కేసీఆర్ కలవనున్నట్లు తెలుస్తోంది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us