రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించడంలేదు

* పేదలకు వైద్య సౌకర్యాలు ఏర్పాటు ప్రాధాన్యత
* గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యం
* అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు
UPDATED 9th JULY 2018 MONDAY 9:00 PM
పెద్దాపురం: గ్రామీణస్థాయి నుంచి మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ఇస్తోందని అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో ఎన్.హెచ్.ఎం నిధులు రూ.కోటి 18 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని స్పీకర్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ డాక్టర్ శివప్రసాదరావు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగానే ఈ గ్రామంలో ఆధునిక సౌకర్యాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. ఎన్.టి.ఆర్ వైద్య సేవలు ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్యపరీక్షలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయడంతో పాటు పారితోషికం, బిడ్డకు బేబీకిట్స్, తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ ద్వారా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థికలోటు ఉన్నప్పటికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేదలకు అందచేయడం జరుగుతుందని అన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించడం లేదని, కేంద్రం సహకరిస్తే పేదలకు మరెన్నో సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగానికి అవసరమైన సాగునీటి కష్టాలను తీర్చడానికే పట్టుసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పట్టిసీమ ద్వారా గుంటూరు వరకు సాగునీరు అందుతున్నాయని, పురుషోత్తపట్నం ద్వారా విశాఖపట్నం వరకు నీరు చేరుతుందని అన్నారు. పేదలకు సొంత ఇంటి కల నిజం చేయడానికి ఇప్పటి వరకు రాష్ట్రంలో 4లక్షలు గృహాలు నిర్మించడం జరిగిందని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధిలో మంత్రి చినరాజప్ప రాజప్ప అహర్నిషలు కృషి చేస్తున్నారని ఇందుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులే నిదర్శమని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ పులిమేరు గ్రామంలో చాలీచాలని గదులతో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రూ. కోటి 18 లక్షలతో నూతన భవనం నిర్మించి అసెంబ్లీ స్పీకర్ తో ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఎంపి నరసింహం మాట్లాడుతూ 10 గ్రామాల ప్రజలకు పులిమేరు పి.హెచ్.సి వైద్యసేవలు అందిస్తుందని, ఆసుపత్రికి సంబంధించిన షెల్టర్ ఏర్పాటుకు ఎంపి నిధులు నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేస్తానని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ ఈ ఆస్పత్రికి అవసరమైన వైద్యులు, మందులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం స్పీకర్ చేతుల మీదుగా వైద్యఖర్చులు నిమిత్తం సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుడాల రమేష్, జెడ్పీటీసి సుందరపల్లి శివనాగరాజు, పెద్దాపురం, సామర్లకోట ఎఎంసి చైర్మన్లు ముత్యాల రాజబ్బాయి, పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల వీరాస్వామి నాయుడు, ఎంపిపి తుమ్మల అరుణ, జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ ఎస్..ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాంబాబునాయిక్, ఏపిఎంఎస్ఐడిసి ఇఇ జి.సి. కేశవరావు, జి.రత్నరాజు, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు కొత్తెం కోటి, తుమ్మల రాము, అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, ఎంపిడివో పి. వసంతమాధవి, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us