గొర్రెల మందపైకి దూసుకెళ్లిన బొలెరో వాహనం

UPDATED 20th JANUARY 2018 SATURDAY 3:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం-జగ్గంపేట ప్రధాన రహదారిలో స్థానిక జె. తిమ్మాపురం ఆయిల్ ఫ్యాక్టరీ   వద్ద శనివారం తెల్లవారుజామున బొలెరో వాహనం ఢీకొట్టి 20 గొర్రెలు మృతి చెందాయి. అలాగే మరో 15 గొర్రెలు గాయపడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సామర్లకోట మండలం పనసపాడు గ్రామానికి చెందిన కొల్లుబోయిన చినకామరాజు, అతని కుమారుడు హరీష్ గొర్రెలను మేతకు జగ్గంపేటకు తొలుకువెళుతున్నారు. ఐతే తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో బొలెరో వాహనం బలంగా వాటిని ఢీ కొట్టడంతో సుమారు 20 గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందాయి. అలాగే మరో 15 గొర్రెలు గాయపడ్డాయి.గొర్రెల కాపరులకు కూడా గాయాలు కావడంతో వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us