మెరుగైన వైద్యసేవలే ప్రభుత్వ లక్ష్యం : ఉపముఖ్యమంత్రి నాని

రంపచోడవరం,25 మే 2020 (రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి మెరుగైన వైద్యసేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని పేర్కొన్నారు. చింతూరు పర్యటన సందర్భంగా మార్గం మధ్యలో రంపచోడవరం ఐటీడీఏకు సంబందించిన పీఎంఆర్సీ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, రంపచోడవరం సబ్ కలెక్టరు ప్రవీణ్ ఆదిత్య, ఏపీ మెడికల్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ బి.వరప్రసాద్, రెడ్ క్రాస్ చైర్మన్ జయప్రకాష్, డి.సి.హెచ్.ఎస్ రమేష్ కుమార్, ఏడియం & హెచ్ వో వినోద్ కుమార్ తో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ ఏజన్సీలోని ప్రతి పేదవానికి మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్యవంతులుగా చేయడమే వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యవిధి అన్నారు. జిల్లాతో పాటూ ఏజన్సీలోని వివిధ రకాల వ్యాధులకు సంబందించిన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రస్తుతము ఏఏ మందులున్నవీ, ఇంకా ఏమేమి కావాలో ఎప్పటికప్పుడు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కరోనా వ్యాధి నిర్మూలించేందుకు ప్రతీ ఇంటికి వెళ్ళి కరోనా పరీక్షలు చేయించే విధంగా ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు. అలాగే చింతూరు ఐటీడీఏ పరిధిలోని మూత్రపిండాలు వ్యాధితో చాలామంది బాధపడుతున్నారని, కొంతమంది చనిపోవడం తమ దృష్టికి వచ్చిందన్నారు. అందుకు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అలాగే డయాలసిస్ సెంటర్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. దీంతో ప్రతీరోజు 10 మందికి డయాలసిస్ చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వస్తున్న వైద్య నిపుణులపై ఆరాతీశారు. ఎన్నిరోజులు వస్తున్నారని రంపచోడవరం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కార్తీక్ మంత్రికి వివరించారు.ఎక్కడైనా దీర్ఘకాలిక వ్యాధి మరణాలు సంభవిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే మూత్రపిండాల వ్యాధులకు సంబందించిన వ్యాధిగ్రస్తులకు ఎంతమందికి రక్తపరీక్షలు చేసింది ఇతర ఆసుపత్రులకు ఎంతమందిని తరలించింది అడిగి తెలుసుకున్నారు. కలెక్టరు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏజన్సీలోని మారుమూల ప్రాంతాలకు రెండు అంబులెన్సులు ఏర్పాటుచేయాలన్నారు. చింతూరు మండలాల్లో డయాలసిస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారన్నారు. ఈ డయాలసిస్ అనుమానాలున్న వారిని ఆసుపత్రికి వచ్చిన వెంటనే రక్తపరీక్షలు కూడా చేయించడం జరిగిందని వివరించారు. చింతూరు పరిసరప్రాంత గ్రామాలలో శబరి నీరు త్రాగడం వలన ఈ మూత్ర పిండాలు వ్యాధి వస్తోందని కొంతమంది అపోహలు పడుచున్నారని,శబరి నీరు త్రాగడం వలన మూత్రపిండాలు వ్యాధి రాలేదన్నారు. చింతూరుకు సమీపంలో చత్తీస్ ఘడ్ మధ్యప్రదేశ్, ఒడిశ, ఝార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించి ప్రజలు చింతూరు మీదుగానే వస్తూపోతూ ఉంటారని అందుకు వైద్యపరంగా నిఘా పెట్టడం జరిగిందని మంత్రికి వివరించారు. రంపచోడవరం ఐటీడీఏ ఇన్చార్జ్ ప్రోజెక్టు అధికారి, రంపచోడవరం సబ్ కలెక్టరు బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ కరోనా వ్యాధి నిర్మూలనకు గత నాలుగు పర్యాయాలు లాక్ డౌన్ ను ప్రభుత్వం ప్రకటించడంతో కరోనా వ్యాధి ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. అదేవిధంగా ఏజన్సీలోని ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి వైద్య అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏజన్సీలోని ప్రతీ పీహెచ్సీలో పలు వ్యాధులకు సంబంధించిన మందులు అంబులెన్సులు కూడా ఏర్పాటుచేయడం జరిగిందని మంత్రికి ఇన్చార్జ్ పివో ప్రవీణ్ ఆదిత్య వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us