UPDATED 8th MARCH 2022 TUESDAY 11:00 AM
Tirumala Srivari Temple : వెంకన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.శ్రీవారికి.. నిత్య సేవల్లో భాగంగా.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు నిర్వహిస్తారు.
కోవిడ్-19 పరిస్థితులకు ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొనసాగుతుంది.అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించి భక్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వర్చువల్ విధానం కూడా కొనసాగుతుంది. వర్చువల్ సేవలను బుక్ చేసుకున్న భక్తులు ఆయా సేవల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదు.