ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

Updated 21st April 2017 Friday 6:30 PM

పెద్దాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దులకు నాణ్యమైన విద్య లభిస్తున్నట్లు వైస్ ఎంపిపి మిరియాల పద్మరాజు పేర్కొన్నారు. పెద్దాపురం మండలం మర్లావ గ్రామంలో మండల పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి. సత్యనారాయణ  అధ్యక్షతన నిర్వహించిన వెన్నెల 2017 వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని శుక్రవారం మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలన్నారు. మండల విద్యాశాఖాధికారి జివిఆర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించడం జరుగుతోందన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్ నడిగట్ల శ్రీనివాసరావు ఉప సర్పంచ్ కామన రామకృష్ణ , ఎస్ ఎం సి చైర్మన్ జి. సత్యనారాయణ, ఉపాధ్యాయులు తుక్కయ్య, జయశ్రీ, రాంబాబు, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us