TTD : తిరుమలలో సినిమా పాటల ప్రసారం.. ఒకరి సస్పెన్షన్

UPDATED 25th APRIL 2022 MONDAY 06:40 PM

Tirupati: ఇటీవల పవిత్ర తిరుమల కొండపై ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై దాదాపు గంటపాటు సినిమా పాటలు ప్రసారమైన సంగతి తెలిసిందే. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, టీటీడీ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ తప్పును సరిదిద్దుకునే చర్యలు చేపట్టింది. దీనికి బాధ్యుడైన అసిస్టెంట్ టెక్నీషియన్‌ను సస్పెండ్ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే టీటీడీ బ్రాడ్‌కాస్టింగ్ ఏఈకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

టీటీడీకి చెందిన ఎస్వీబీసీ భక్తి ఛానెల్‌లో వేంకటేశ్వర స్వామికి చెందిన పాటలు, కార్యక్రమాలు మాత్రమే ప్రసారమవుతాయి. అయితే, ఈ నెల 22న సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వేరే ఛానెళ్లకు చెందిన పాటలు ప్రసారమయ్యాయి. దీంతో స్పందించిన టీటీడీ.. అసిస్టెంట్ టెక్నీషియన్ రవి కుమార్‌ను సస్పెండ్ చేయగా, బ్రాడ్‌కాస్టింగ్ విభాగానికి చెందిన ఏఈ కృష్ణ ప్రసాద్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us