గైట్ లో వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు

UPDATED 25th JUNE 2018 MONDAY 7:00 PM 

రాజానగరం: వ్యక్తిత్వ వికాస అభివృద్ధి, వృత్తి విజయం అనే అంశంపై స్థానిక గైట్ పాలిటెక్నిక్ కళాశాలలోని విద్యార్థులకు సోమవారం శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోవర్ధన రామానుజం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పారా సైకాలజిస్ట్, ప్రఖ్యాత ట్రైనర్ డాక్టర్ జగన్నాధరావు హాజరై మాట్లాడుతూ విజయసాధనలో విద్యార్థులకు సమాచార నైపుణ్యాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలని, పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో విద్యార్థులు విజయం సాధించవచ్చని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలు సాధించే దిశగా విద్యార్థులు కృషిచేయాలని, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రామానుజం మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇవ్వడంలో దక్షిణ భారతదేశంలోనే జగన్నాధరావు ప్రఖ్యాతి చెందారని, ఈ కార్యక్రమం రెండురోజులపాటు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us