నూకాలమ్మ జాతరకు భక్తుల రద్దీ

UPDATED 1st APRIL 2018 SUNDAY 6:30 PM

కాండ్రకోట (పెద్దాపురం): భక్తుల కొంగు బంగారం కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఆలయ ఈవో పులి నారాయణమూర్తి, చైర్మన్ ఎలిశెట్టి నాగలక్ష్మీ నాని భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్వచ్ఛంధ సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీరు సరఫరా చేశారు. సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంచే గాంధీ, ఉప సర్పంచ్ ఎలిశెట్టి చక్రప్రకాష్, తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, ఆలయ ధర్మక్తల మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us