ఘనంగా ప్రారంభమైన మరిడమ్మ జాతర

UPDATED 12th JULY 2018 THURSDAY 5:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో వేంచేసి ఉన్న మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. అమ్మవారి విగ్రహాన్ని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం వద్ద అలంకరించిన వాహనంపై ఉంచారు. అనంతరం జాతర మహోత్సవాలను మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గురువారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ ఆర్. పుష్పనాధం వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణకుంభంతో, మంగళ వాయిద్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ మరిడమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, రాష్ట్రం మరింత అభివృద్ధిలోకి రావాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 12 నుంచి అగస్ట్ నెల 18వ తేదీ వరకు ప్రతీ ఏటా ఆషాఢమాసంలో జరిగే  జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని తెలిపారు. అమ్మవారిని దర్శనానికి స్థానికులే కాకుండ ఉభయ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందని అన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా క్యూలైన్లు, మంచినీటి సౌకర్యాలు, పారిశుద్యం, విశ్రాంతి భవనం ప్రత్యేకమైన ప్రసాదం కౌంటర్లు, సమాచార కేంద్రం, పోలీసు బందోబస్తు, రవాణా, తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. జాతర మహోత్సవాలను పురస్కరించుకుని పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు,మున్సిపల్ మాజీ  వైస్ చైర్మన్ త్సలికి సత్య భాస్కరరావు, వార్డు కౌన్సిలర్ విజ్జపు రాజశేఖర్, దేవాలయం ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, ధర్మకర్తల మండలి సభ్యులు గోలి శ్రీరాములు, కొంగర సత్యనారాయణ, కొటాని గణేష్‌, గోమాడ అర్జునరావు, తమ్మన సత్యనారాయణ, ఆకుల మురళీకృష్ణ, ఇజ్జన కృష్ణవేణి, కొప్పర్తి కృష్ణ, రాయి విజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 
    
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us