Annavaram : నేటి నుంచి సత్యదేవుని ఆవిర్భావ ఉత్సవాలు

UPDATED 29th JULY 2022 FRIDAY 06:00 AM

Annavaram : రత్నగిరివాసుడైన సత్యదేవుడికి శుభకృత్‌ నామ సంవత్సర ఆవిర్భావ దినోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.15కు గణపతిపూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌వరుణలు, వేదపారాయణలు, జపములు, మంటపారాధనలు, నవగ్రహ మూలమంత్ర జపములు, చండీపారాయణ, సూర్యనమస్కారములు నిర్వహిస్తారు. సాయంత్రం దాత మట్టే సత్యప్రసాద్‌ దంపతులు స్వామివారికి ప్రత్యేకంగా తయారుచేయించిన వజ్రకిరీటాన్ని దేవస్థానం అధికారులకు అందిస్తారు.

కిరీటం సంప్రోక్షణ అనంతరం గర్భాలయంలో మూలవరుల చెంతకు అర్చకస్వాములు చేర్చి శనివారం వేకువజామున జరిగే పంచామృతాభిషేకాలు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలలో ఉంచి విశేష అర్చనలు చేస్తారు. ఈఏడాది వేడుకలను అనివేటి మండపంలో నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి అనివేటి మండపంలో రంగురంగుల విద్యుద్దీప అలంకరణలు, ప్రత్యేకవేదిక, నూతనంగా హోమగుండం ఏర్పాటు చేశారు.

శనివారం ఉదయం 9 గంటలకు ఆయుష్యహోమం ప్రారంభించి 11 గంటలకు పూర్ణాహుతి గావిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి వెండిరథంపై ప్రాకారసేవ నిర్వహించి రాత్రి 8గంటలకు వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించడంతో వేడుకలు ముగుస్తాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us