Mega154: మెగా154లో ఉప్పెన సృష్టించబోతున్న విలన్..?

UPDATED 30th MAY 2022 MONDAY 09:30 PM

Mega154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్‌గా గాడ్‌ఫాదర్ సినిమాను పూర్తి చేసేందుకు చిరు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’, బాబీ డైరెక్షన్‌లో మెగా 154 సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో చిరు నటిస్తున్న మెగా 154 సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే మెగా 154 సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనే టాక్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో టాప్ యాక్టర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహా రెడ్డి’లో చిరు అనుచరుడిగా నటించారు. అయితే ఇప్పుడు మెగా 154లో విజయ్ సేతుపతి పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు విజయ్ సేతుపతి ఎంట్రీ ఉంటుందని.. ఆ తరువాత ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో మనకు సెకండాఫ్‌లో చూపిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ రోల్‌లో నటిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us