ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో ఉత్తమ ఫలితాలు

UPDATED 6th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమన్వయంతో మంచి ఫలితాలు సాధించడం వీలవుతుందని మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక అయోధ్యరామాపురంలో గల మున్సిల్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సాయిరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశలో పదవతరగతికి ప్రత్యేకమైన స్థానం ఉందని, దానిలో మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నూరు శాతం ఫలితాలతో పాటు ఎక్కువమంది విద్యార్థులు10 జిపిఎ సాధన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఎస్ఎంసి చైర్ పర్సన్ సప్పా గంగాభవాని మాట్లాడుతూ విద్యార్థులు ప్రతీరోజు పాఠశాలకు వచ్చేలా తల్లిదండ్రులు చూడాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులు తమ పాఠ్యాంశాలలో విద్యార్థుల ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి. గోవిందు, కె. అరుణ, ఎఎల్ వి కుమారి, కె.వి.వి సత్యనారాయణ, శ్రీలక్ష్మి, ఎపిఆర్ రాజేంద్రకుమార్, డివిఆర్ఎన్ వల్లి, కె. శ్రీనివాస్, రమాదేవి, భద్రావతి, పిఎఎస్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us