TTD: తిరుమలలో వైభవంగా శ్రీవారి పౌర్ణమి గరుడసేవ

UPDATED 16th FEBRUARY 2022 WEDNESDAY 09:00 PM

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి తిరుమల మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహన సేవ ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియజేస్తాడని ప్రతీతి. జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటి నమ్మకం. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, పేష్కార్ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us