AP News: చిరంజీవితో జరిగినవి సంప్రదింపులు కావు: పేర్ని నాని

UPDATED 21 JANUARY 2022 FRIDAY 06:00 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్) : ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం అటు ప్రభుత్వం ఇటు సినీ పెద్దల మధ్య అగాధాన్ని పెంచింది. సినీ నిర్మాతలతో పాటు దర్శకుడు రాంగోపాల్ వర్మతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవిని సీఎం జగన్ తాడేపల్లికి పిలిపించుకున్నారు. చిరంజీవి, జగన్ భేటీతో టికెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అందరూ అనుకున్నారు. జగన్‌తో సమావేశం తర్వాత చిరంజీవి కూడా అందరికీ శుభవార్త తెలిపారు. సినీ రంగ సమస్యలపై జగన్ సానుకూల రీతిలో స్పందించారని, త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని చిరంజీవి తెలిపారు. సినీ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ సీఎంకు సమగ్రంగా వివరించానని చెప్పారు. జగన్‌ ఇచ్చిన భరోసాతో ధైర్యం వచ్చిందన్నారు. సినీ పరిశ్రమవారు ఎవరూ అభద్రతా భావానికి లోనుకావద్దని, సంయమనంతో వ్యవహరించాలని, విమర్శలు చేయవద్దని కోరారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us