Kinnera Mogulaiah: పవన్ కళ్యాణ్ పాటతో హైప్.. కిన్నెర మొగులయ్యకి పద్మశ్రీ

Updated 26 January 2022 Wednesday 09:20 AM

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో టైటిల్ సాంగ్ తో దర్శనం మొగులయ్య బాగా ఫేమస్ అయ్యారు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా ‘భీమ్లా నాయక్’ సినిమా పాటతో బాగా పాపులర్ అయ్యారు మొగులయ్య. తాజాగా అంతరించి పోతున్న కిన్నెర కళని ఇంకా బతికిస్తున్న మొగులయ్యకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.

తెలంగాణ నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలంకి చెందిన మొగులయ్య తాతల నుంచి తనకు అందిన 12 మెట్ల కిన్నెరతోనే ఆయన కాలం గడుపుతున్నాడు. తాత ముత్తాలనాటి జానపదకళకు ప్రాణం పోస్తున్నారు. ఊరూ వాడా తిరుగుతూ తన కళను అందరికీ పరిచయం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ మొగిలయ్యకు సన్మానం చేశారు. ఆ తరువాత ఆయన చరిత్రను 8వ తరగతి సిలబస్ లో చేర్చారు. దీంతో అప్పుడప్పుడు స్కూళ్లకు వెళ్లి ప్రదర్శనలు కూడా ఇచ్చారు.

ఇటీవల మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలో పాట పాడటంతో వెలుగులోకి వచ్చారు. ఈ పాట పాపులర్ అయ్యాక పవన్ కళ్యాణ్ మొగిలయ్యని అభినందించారు. ఆర్థిక సాయం కూడా చేశారు. ఈ కళను ఇకపై ప్రచారం చేయడానికి కూడా ఎవరూ లేరట. ఈ కళ తనతోనే అంతరించిపోతుందేమోననే ఇటీవల దిగులు చెందారు మొగిలయ్య. కేంద్ర ప్రభుత్వం ఆయనకీ పద్మశ్రీ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us