ప్రజా సమస్యల పరిష్కారానికి జన్మభూమి దోహదం

UPDATED 11th JANUARY 2018 THURSDAY 7:00 PM

సామర్లకోట: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి- మా ఊరు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వీకే రాయపురంలో నిర్వహించిన జన్మభూమి- మా ఊరు ముగింపు కార్యక్రమంలో ఆయన కాకినాడ ఎంపీ తోట నరసింహంతో కలిసి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. అలాగే కార్యక్రమం విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడం ఒక్క టీడీపీకే సాధ్యమన్నారు. అనంతరం చంద్రన్న సంక్రాంతి కానుకలు,రేషన్ కార్డులను, పింఛన్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, జడ్పీటిసీ గుమ్మళ్ల విజయలక్ష్మి రామకృష్ణ, సర్పంచ్ కుర్రా నారాయణ స్వామి, ఎంపిటీసీ గొనిపాటి మాధవస్వామి, ఎంపిటీసీ రేలంగి వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us