KTR : ఎమ్మెల్యే రాజాసింగ్ బుల్డోజర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి కేటీఆర్

UPDATED 16 FEBRUARY 2022 WEDNESDAY 12:40 PM

హైదరాబాద్: యూపీలో బీజేపీకి, యోగికి ఓటు వేయనివారిని గుర్తించి, వాళ్ల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తామంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాజాసింగ్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీలో మరో అద్భుతమైన కమెడియన్ పుట్టుకొచ్చాడంటూ సెటైర్ వేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను కమెడియన్ తో పోల్చారు. నిన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి, యోగికి ఓటు వేయని వారిని గుర్తించి వారి ఇళ్లపైకి బుల్డోజర్లను పంపించి కూల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసిందని.. మూడో విడత పోలింగ్‌లో కచ్చితంగా హిందువులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. యూపీ ఎన్నికల్లో హిందువులందరూ..ఏకం కావాలని..హిందువులంతా యోగి ఆదిత్యనాథ్‌కు ఓటువేయాల్సిందేనని..పిలుపునిచ్చారు. ఎన్నికల్లో యోగీకి ఓటు వేయనివారంతా ద్రోహులు అని..వారికి ఉత్తర ప్రదేశ్‌లో స్థానం లేదని స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల్లో యోగీ ఆదిత్యానాథ్ కు ఓట్లు వేయని వారిని గుర్తిస్తామని రాజాసింగ్ అన్నారు. యోగికి ఓటు వేయని వారిని తరిమి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us