TS News: బండి సంజయ్ మౌన దీక్ష

UPDATED 3 FEBRUARY 2022 07:15 AM

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): తన పార్టీ ఎంపీలతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో మౌన దీక్ష చేయనున్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్ మౌన దీక్షకు సిద్ధమయ్యారు. ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరామ్‌ సహా పలువురు పార్టీ నేతలతో కలిసి ఆయన దీక్ష చేయనున్నారు. 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం ఉదయం 11 నుంచి రాజ్‌ఘాట్ వద్ద ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టనన్నారు.

దళిత సీఎం విషయంలో కేసీఆర్ ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోవడం, దళిత బంధును ఎన్నికల స్టంట్‌గా మార్చడం, దళితులకు మూడెకరాలతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు లాంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కూడా ఈ సందర్భంగా జనం ముందుకు ఉదృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ సిద్దమైనట్టు తెలిపారు. ఇటు రాష్ట్రంలోని ఆయా పార్టీ కార్యాలయలతో పాటు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు కూడా పార్టీ పిలుపునిచ్చింది. దీంతో గురువారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా పార్టీ సీనియర్ నేతలు మౌన దీక్షకు కూర్చోనున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us