CM KCR : బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు ప్రాంతీయ పార్టీల ప్లాన్.. దీదీ, మహారాష్ట్ర సీఎంలతో కేసీఆర్ భేటీ..

UPDATED 14th FEBRUARY 2022 MONDAY 07:00 PM

హైదరాబాద్: బీజేపీకి వ్యతిరేకంగా భారత్ లో ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నాయా? కమల దళానికి చెక్ పెట్టటానికి సీఎంలు ఏకమవతున్నారా? అంటే నిజమేనని అనిపిస్తున్నాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నానని ప్రకటించిన క్రమంలో నిజమేననిపిస్తున్నాయి ప్రస్తుత రాజకీయ పరిణామాలు. గతంలో సీఎం కేసీఆర్ పలువురు నేతలను కలిసారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయా రాష్ట్రాల సీఎంలు భావిస్తున్నారు. ఈక్రమంలో దీదీ ఇప్పటికే సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ తో మాట్లాడినట్లుగా ప్రకటించారు.

మార్చి 3న వారణాశిలో ర్యాలీ : మమత

ప్రాంతీయ పార్టీల భేటీ విషయంలో మమతా మాట్లాడుతూ..దేశ సమాఖ్యను బీజేపీ దెబ్బతీస్తోందని..దేశ సహాఖ్యను కాపాడటానికి యత్నిస్తున్నామని..దీంట్లో భాంగానే ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. దీని కోసం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో సంబంధం లేకుండానే పోరాడతామని అన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీతోనే కాంగ్రెస్ మంచి సంబంధాలు లేవని..కాబట్టి కాంగ్రెస్ తో సంబంధం లేకుండానే మా దారిలో మేం వెళతామని దీదీ స్పష్టంచేశారు. దీని కోసం ప్రధాని మోడీ నియోజకవర్గం అయినా వారణాశిలో మార్చి 3న ర్యాలీ నిర్వహిస్తామని మమతా బెనర్జీ వెల్లడించారు.

మరోపక్క సీఎం కేసీఆర్ కూడా బీజేపీపై తరచు మండిపడుతున్నారు. బీజేపీని పారగొడతామని ప్రతినలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ప్రాంతీయ పార్టీలతో చేతులు కలుపుతామని తెలిపారు. తెలంగాణలో ముచ్చింతల్ లో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు పూర్తి అయ్యాక మహారాష్ట్ర సీఎం ఉద్థవ్ థాక్రేను కలుస్తానని తెలిపారు. థాక్రే తనకు ఫోన్ చేశారని తెలిపిన కేసీఆర్ త్వరలోనే ఆయనతో సమావేశమవుతానని..మమతా బెనర్జీ హైదరాబద్ వస్తానని ఫోన్ చేసిన చెప్పారని కేసీఆర్ తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us