బాధితులకు సత్వర న్యాయం అందించాలి

* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య

UPDATED 11th JUNE 2020 THURSDAY 6:00 PM

రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): షెడ్యూల్డు కులాలు, షెడ్యూలు తెగలకు చెంది అట్రాసిటీ కేసులలో ఉన్న బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసు, రెవిన్యూ విభాగాలు సమన్వయం, న్యాయస్థానాల సహకారంతో కృషి చేయాలని ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో డివిజన్ స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్సు అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏయే మండలాలలో ఎన్ని కేసులు ఏఏ సెక్షన్ల క్రింద నమోదై ఏదశలో ఉన్నాయో ఆయన ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసులు పెండింగులో లేకుండా పోలీసు సబ్- ఇనస్పెక్టర్ల వద్ద నుంచి రెవిన్యూ అధికారులు ప్రాధమిక సమాచార నివేదికలు, ఛార్జిషీటులు తీసుకొని సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని, ఇరువిభాగాలు శాంతి భద్రతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. డివిజన్ పరిధిలో 15 కేసులు పెండింగ్ ఉన్నాయని, 27 కేసులు ప్రతిపాధనల దశలో ఉన్నాయన్నారు. జిల్లా కమిటీలో 61 కేసులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. బాధితుల పిల్లలకు పునరావాసం, కుటుంబ సభ్యుల ధృవపత్రాలు, ఆదాయ ధృవ పత్రాలు జారీలో తహసీల్దార్లు పూర్తిగా విచారణ జరిపి తగు న్యాయం చేకూర్చాలని, నష్టపరిహారాలు చెల్లింపులో జాప్యాలకు తావులేకుండా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరు కార్యాలయానికి ప్రతిపాధనలు పంపుతూ బాధిత కుటుంబాలకు సహకరించాలని అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కోరినట్లుగా పౌరహక్కుల సమావేశాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా పోలీసులు గ్రామ సచివాలయాల సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు ద్వారా అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 విధి విధానాలు, భూ బదలాయింపు చట్టాలు, అట్రాసిటీ కేసులు పట్ల పూర్తి అవగాహన, న్యాయం ఏవిధంగా పొందాలి అన్న అంశాల పట్ల గిరిజనులలో పూర్తి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఆయా కార్యక్రమాలలో స్వచ్ఛంద సేవా సంస్థలు తమ వంతు సహకారం అందించి గిరిజనులను మరింతగా చైతన్యవంతుల్ని చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే  నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల పట్ల అన్ని శాఖల అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి బాధిత కుటుంబాలకు పూర్తిగా న్యాయం చేకూర్చాలని, అలాగే కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు విచారణలు చేపట్టి గిరిజనులు విద్యా ఉద్యోగావకాశాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడు మండలాల తహసీల్దార్లు, సిఐలు బిహెచ్ వెంకటేశ్వర్లు, రవికుమార్, ఎన్ఎ తులసిరామలు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us