AP News: ఏపీలో రాత్రి కర్ఫ్యూ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో ఇవాల్టి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇవాల్టి నుంచి జనవరి 31వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ నిబంధనల నుంచి ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, వైద్యులు, మెడికల్ సిబ్బంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్లు, పెట్రోలు బంకులు, ఐటీ సేవలు, అత్యవసర సేవల సిబ్బందికి మినహాయింపు ఇచ్చారు. వీరితో పాటు గర్భిణులు, చికిత్స పొందుతున్న రోగులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారికి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. మరో వైపు కొవిడ్ నియంత్రణా చర్యల్లో భాగంగా కర్ఫ్యూ అమలు కాని సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్ వేదికల్లో 100మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. వాణిజ్య సముదాయాలు, దుకాణాల్లో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన జరిగితే రూ.10 వేల నుంచి రూ. 25వేల వరకు జరిమానా విధించనున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us