జిల్లా పరిషత్ శత వసంతాల లోగో ఆవిష్కరణ

UPDATED 7th APRIL 2018 SATURDAY 9:00 PM

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మే నెలలో శత వసంతాల వేడుకలు కాకినాడలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ శత వసంతాల వేడుకల లోగోను నవీన్ కుమార్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ శత జయంతి వేడుకలలో పాల్గొనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ లను ఆహ్వానించడం జరిగిందని, మే నెల 5వ తేదీ తర్వాత ఏదో ఒక రోజున శత జయంతి వేడుకలను నిర్వహించడానికి తేదీని ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఈ శత జయంతి వేడుకలు సందర్భంగా గత 100 సంవత్సరాలలో జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేసిన వారి ఫొటోలతో పాటు పేర్లు, జిల్లా చరిత్ర, జిల్లాలోని ప్రముఖుల చరిత్ర ప్రచురించి భావితరాల వారికి తెలియజేయడానికి ప్రచురించిన సావనీర్ ను విడుదల చేయడం జరుగుతుందని, ఈ శత జయంతి ఉత్సవాలలో మంత్రులు, జిల్లా పరిషత్ సభ్యులు, ప్రజలు సహకారంతో విజయవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ నవీన్ కుమార్ తెలిపారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us