పాడిగేదెను కాపాడబోయి మహిళ మృతి

UPDATED 9th JUNE 2017 FRIDAY 4:00 PM

పెద్దాపురం: పాడిగేదెను కాపాడబోయి విద్యుత్ షాక్ తో ఒక మహిళా మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యండపల్లి మాణిక్యం (52)కు చెందిన పాడిగేదె పొలంలో గడ్డి మేస్తున్న సంధర్భంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి మృత్యువాతకు గురయ్యింది. అయితే అది గమనించిన మాణిక్యం పాడిగేదెను కాపాడబోయి తాను కూడా విద్యుత్ షాక్ కు గురయ్యింది. దీంతో ఆమె అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. ఈ విషయంపై పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us