భీమేశ్వరస్వామి ఆలయంలో సిసిఎల్ఎ కమీషనర్ ప్రత్యేక పూజలు

UPDATED 22nd JUNE 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోటలోని వేంచేసివున్న ప్రసిద్ధ పంచారామ క్షేత్రం చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి వారి దేవాలయంలో సిసిఎల్ఏ చీఫ్ కమీషనర్ అనిల్ చంద్ర పునేఠా స్వామి, అమ్మ వారిని శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఈవో పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు తొలుత ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదస్వస్తి పలికి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో ఎల్. రఘుబాబు, తహసీల్దార్ ఎల్. శివకుమార్, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us