లోవ దేవస్థానానికి భక్తుల తాకిడి

తుని (రెడ్ బీ న్యూస్)‌ 24 అక్టోబరు 2021: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేకువజామున తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆల య ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అమ్మవారిని సర్వాంగసుందరంగా అలంకరించిన అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యూల్లో బారులుతీరిన భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఈవో విశ్వనాధరాజు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి ఆదివారం రూ.3.81 లక్షల ఆదా యం సమకూరినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో విశ్వనాధరాజు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు, దర్శనానంతరం అర్చకస్వాములు అమ్మ వారి మహా ప్రసాదం, వేదఆశీర్వచనం అందజేశారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us