Updated:10th April 2017 Monday 5:10PM
పెద్దాపురం : పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామదేవత గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.