Chiranjeevi: యంగ్ హీరోలకే అందని దూకుడు.. చిరు మెగా లైనప్!

REDBEENEWS:

Chiranjeevi: యంగ్ హీరోలకు షాక్ మీద షాకిస్తున్నారు మెగాస్టార్. 152 నుంచి 156వ సినిమా వరకు లైన్ పెట్టిన చిరూ.. ఆ లైనప్ ను పెంచే పనిలోనే ఉన్నారు. ఇంకో రెండు ప్రాజెక్టలను యాడ్ చేసి కౌంట్ పెంచారిప్పుడు. ప్రజెంట్ భారీ బడ్జెట్ అవసరం లేదు.. ఫారెన్ రిచ్ లోకేషన్స్ లో పని లేకుండానే మెగాస్టార్ మెగా సినిమాలతో దూసుకెళ్తున్నారు. కొవిడ్ తో సినిమాలు వాయిద పడుతున్నా చిరూ మాత్రం లైనప్ పెంచేస్తున్నారు. చిరూ 157, చిరూ 158 ప్రాజెక్టలకులకు కూడా రంగం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడైనా అనౌన్స్ మెంట్ రావొచ్చు. చిరూ తన 157వ సినిమాను మారుతితో ఫైనల్ చేశారని తెలుస్తోంది. మారుతి మార్క్ డైరెక్షన్ కి చిరూ యాక్షన్ తోడైతే భీభత్సమే అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

 

మెగా 158 సినిమా డైరెక్ట్ చేయబోయేది అనిల్ రావిపూడి. వరుస హిట్స్ తో ఫన్ డోస్ ఇస్తున్న అనిల్ రావిపూడి ఈమధ్యే చిరూకి కథ వినిపించి ఓకే చేయించుకున్నారు. ప్రస్తుతం ఎఫ్3 చేస్తున్న అనిల్ రావిపూడి.. తర్వాత బాలకృష్ణతో సెట్స్ పైకెళ్తాడు. ఆ తర్వాతే మెగాస్టార్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో అంటేనే మెగాభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ కి పెరిగాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us