AP News: విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు

Updated 2 February 2022 Wednesday 05:15 PM

విజయవాడ (రెడ్ బీ న్యూస్): పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పీఆర్సీ సాధనా సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉద్యోగసంఘాల ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలోని బీఆర్టీయస్ రోడ్ లో ర్యాలీ, సభ నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఉద్యోగ సంఘాల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ర్యాలీ, సభ నిర్వహించ తలపెట్టిన బీఆర్టీయస్ రోడ్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విజయవాడ బీఆర్టీయస్ రోడ్డులో వాహనాలను నిషేధించిన పోలీసులు.. ఆమేరకు నగరంలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు ప్రకటించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us