బేతాళస్వామి కల్యాణ మండపం ప్రారంభం

UPDATED 11th MARCH 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన బేతాళ స్వామి ఎన్టీఆర్ కల్యాణ మండపాన్ని రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి  చినరాజప్ప మాట్లాడుతూ రూ. 80 లక్షలు దాతలు సహకారంతో నిర్మించిన ఈ భవనం పనులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తానని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా తాను కృషిచేస్తున్నానని, రానున్నకాలంలో నియోజక వర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి, ఉప సర్పంచ్  వల్లూరి శ్రీనివాస్, దేవస్థానం చైర్మన్ కంటే జగదీష్ మోహన్,  ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమార స్వామి, ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, పెద్దాపురం ఎఎంసి చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, దేవస్థానం పాలక మండలి సభ్యులు, ఎంపిడివో ఎ. సత్యనారాయణ, మట్టే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us