తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత

విశాఖ (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూశారు. విశాఖలో కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనకు ఈ వేకువజామున 4గంటలకు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. 1978 నుంచి శ్రీవారి సేవలో డాలర్‌ శేషాద్రి తరిస్తున్నారు. 2007లోనే రిటైర్‌ అయినప్పటికీ ఆయన సేవలను గుర్తించిన తితిదే ఓఎస్డీగా కొనసాగిస్తోంది. డాలర్‌ శేషాద్రి మరణం తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)కి తీరని నష్టమని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు భర్తీకాదని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో చిన్న కొలువుతో మొదలైన శేషాద్రి జీవితం.. తిరుమల అర్చకులు అనగానే ఆయన ముఖమే గుర్తొచ్చేంత అత్యున్నత స్థాయికి ఎదగడం తెలిసిందే. 1978 నుంచి టీటీడీలో సేవలు అందిస్తోన్న ఆయన 2007లో రిటైర్మెంట్ పొందినప్పటికీ, ఆయన సేవలు అనివార్యమని భావించిన ప్రభుత్వాలు శేషాద్రిని ఓఎస్డీగా కొనసాగించాయి. దేవాలయ సాంప్రదాయాలపైన, దేవాలయ క్యూలైన్ల నిర్వహణా వ్యవహారాల పైన డాలర్ శేషాద్రికి గొప్ప పట్టుంది. ఇదివరకు తిరుమల ఆలయంలో శ్రీవారి బంగారు రూపులు (డాలర్లు) అమ్మేవారు. ఆ విక్రయ విభాగం ఆయన ఆధ్వర్యంలో నడిచేది. కాబట్టే ఆయనకు డాలర్ శేషాద్రి అనే పేరొచ్చింది. డాలర్ శేషాద్రిపై ప్రశంసలు ఎన్ని ఉన్నాయో విమర్శలు కూడా అన్నే ఉన్నాయి. అయితే సదరు వివాదాల్లో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. శేషాద్రి మరణంపై ప్రముఖులు నివాళులు అర్పించారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us