విద్యార్థుల మానసిక వికాసానికి ఎన్.సి.సి దోహదం

* కాకినాడ గ్రూపు కమాండర్ ఎల్.సి.ఎస్.నాయుడు

UPDATED 26th OCTOBER 2018 FRIDAY 5:00 PM

పెద్దాపురం: విద్యార్థుల మానసిక వికాసానికి, ఉజ్వల భవిష్యత్తుకు ఎన్.సి.సి ప్రముఖ పాత్ర వహిస్తుందని కాకినాడ గ్రూపు కమాండర్ ఎల్.సి.ఎస్.నాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ నెల 25వ తేదీ నుంచి నవంబరు మూడు వరకు పది రోజులపాటు కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ ఎ.ఎస్.రాణా ఆధ్వర్యంలో జరుగుతున్న మూడవ ఆంధ్రా గరల్స్ బెటాలియన్ ఎన్.సి.సి కంబైండ్ ఏన్యూవల్ ట్రైనింగ్ క్యాంపును కాకినాడ గ్రూపు కమాండర్ కల్నల్ ఎల్.సి.ఎస్.నాయుడు సందర్శించారు. అనంతరం ఎన్.సి.సి విద్యార్థులతో శిక్షణా క్యాంపుపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఎల్.సి.ఎస్. నాయుడు పాల్గొని మాట్లాడుతూ విద్యతోపాటు విద్యార్థులు ఎన్.సి.సిలో కూడ ప్రతిభను చూపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన క్యాంపులను నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తోందని, ఎన్.సి.సి ద్వారా విద్యార్థులకు శరీర ధృడత్వం, మానసిక వికాసం, క్రమశిక్షణ, తదితర నైపుణ్యాలు పొందవచ్చని అన్నారు. ప్రతీ విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం, మాతృభాషలోనే కాకుండా ఆంగ్లంలో కూడా  నైపుణ్యం సాధించాలని, తద్వారా ఉజ్వల భవిష్యతను సాధించవచ్చన్నారు. యోగా, వ్యాయామం, సాంస్కృతిక, తదితర కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలన్నారు. ఈ క్యాంపులో యోగా, పిజికల్ ట్రైనింగు, మ్యాప్ రీడింగ్, వెపన్ ట్రైనింగ్, సోషల్ సర్వీసెస్, స్వచ్చభారత్, కమ్యూనిటీ డవలప్మెంట్ మొదలైన అంశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ శిక్షణా క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఎ గ్రేడ్ సర్టిఫికెట్లు పొందాలని తెలిపారు. ఉదయం శిక్షణా కార్యక్రమాలు అనంతరం రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ క్యాంపులో పాల్గొన్న ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన విద్యార్థులకు అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. మునిరామయ్య, డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ సందీప్ సింగ్, సబ్ మేజర్ సురేంద్రసింగ్, ఎ.ఎన్.వోలు పి. శారద, కృష్ణవేణి, ఎన్.సి.సి విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 
 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us