రాజమహేంద్రవరంలో సినీ హీరో సూర్య సందడి

UPDATED 15th JANUARY 2018 MONDAY 9:00 PM

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలో సినీ హీరో సూర్య సందడి చేశారు. ఆయన నటించిన గ్యాంగ్‌ సినిమా విజయోత్సవ ర్యాలీలో భాగంగా సోమవారం రాజమహేంద్రవరం నగరంలో గ్యాంగ్‌ సినిమా ప్రదర్శిస్తున్న మేనక థియేటర్‌ కు వచ్చిన సూర్యను చూసి కేరింతలతో సింగం, సింగం.అంటూ అభిమానులు నినాదాలు చేశారు. థియేటర్‌లో అభిమానులతో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని తెలుగు సినిమాలు నటించనున్నట్లు ఆయన తెలిపారు. తమ అభిమాన హీరోని చూసేందుకు థియేటర్‌ వద్దకు భారీగా జనం తరలిరావడంతో సూర్య బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఆయన వెంట గ్యాంగ్‌ సినిమా డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌, థియేటర్‌ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us