Bollywood Heroins: టాలీవుడ్‌కి క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోయిన్స్.. ఇదీ క్రేజ్ అంటే!

Bollywood Heroins: సౌత్ హీరోయిన్ల అల్టిమేట్ టార్గెట్.. ఎంత కాదనుకున్నా.. బాలీవుడ్ సినిమాల్లో చెయ్యడమే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్లు.. వరసపెట్టి టాలీవుడ్ కి క్యూ కడుతున్నారు. స్టార్ హీరోయిన్ల దగ్గరనుంచి అప్ కమింగ్ హీరోయిన్ల వరకూ టాలీవుడ్ హీరోలతో జత కడుతూ సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎంట్రీకి రెడీ అయ్యారు.

తెలుగు సినిమా రేంజ్ పాన్ ఇండియా లెవల్ కి మారిపోయింది. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించి తమ క్రేజ్ ని, మార్కెట్ ని పెంచుకోడానికి వరస పెట్టి టాలీవుడ్ బాట పట్టారు. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా తెలుగులో తన రెండో సినిమాని అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ -కొరటాల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా ఆలియా నటిస్తోంది. దీని కంటే ముందే ట్రిపుల్ఆర్ లో రామ్ చరణ్ కి జంటగా నటించి తెలుగు ఎంట్రీకి రెడీ అయ్యింది.

మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్.. బేసిక్ గా సౌత్ అమ్మాయే అయినా.. బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి టాప్ స్టార్ అయ్యింది. ఇప్పుడు దీపికా కూడా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. నాగాశ్విన్ -ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియామూవీ ప్రాజెక్ట్. కె సినిమాలో దీపికా పదుకోన్ ప్రభాస్ కి జంటగా నటిస్తోంది.

టాప్ హీరోయిన్స్ తో పాటు అప్ కమింగ్ బాలీవుడ్ భామ అనన్య పాండే కూడా తెలుగు అరంగేట్రినికి అంతా సిద్దం చేసుకుంది. పూరీ జగన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లైగర్ మూవీలో విజయ్ దేవరకొండకు హీరోయిన్ గా ఫిక్స్ అయిన అనన్యపాండే తెలుగు ఆడియన్స్ ని తన అందం, అభినయంతో మెస్మరైజ్ చెయ్యబోతోంది.

మరో బ్యూటి ఫుల్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ అయితే ఏకంగా 2 సినిమాలతో తెలుగులోకి వస్తోంది. మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ అధారంగా తెరకెక్కిన.. అడవి శేష్ మూవీ మేజర్ మూవీతోపాటు, వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గని సినిమాలో కూడా హీరోయిన్ గా మరో సినిమా ఆఫర్ కొట్టేసింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తెలుగులో బిజీ అయ్యింది సాయిమంజ్రేకర్.

శ్రీదేవి కూతురు.. బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వి కపూర్ కూడా తెలుగు ఎంట్రీకి రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో జాన్విని టాలీవుడ్ కి తీసుకురావాలని చాలా మంది ట్రై చేస్తున్నా.. ఆ ట్రయల్ ఇప్పటికి సక్సెస్ అవుతోంది. విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్లో రెండో సినిమాగా తెరకెక్కబోతున్న జనగణమన సినిమాలో హీరోయిన్ గా జాన్వి ఫిక్స్ అయ్యినట్టు న్యూస్.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us