Super Machi: చిరంజీవి అల్లుడి చిత్రం.. ఆసక్తిగా 'సూపర్ మచ్చి' ట్రైలర్

రెడ్ బీ న్యూస్,12 జనవరి 2022 : ప్రముఖ నటుడు చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన చిత్రం 'సూపర్ మచ్చి'. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రచితారామ్ కథానాయిక కాగా పులివాసు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. 'చూడకుండా లవ్ చేసుకునే కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇందులో ఏదో తెలియని ఫీల్ ఉంది' అని కథానాయిక చెప్పిన డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. హీరోయిన్.. హీరోని సర్ సర్ అని పిలిచే సన్నివేశాలు, కామెడీ ట్రాక్, ఎమోషన్.. ఆకట్టుకునేలా ఉన్నాయి. కట్ చేస్తే, హీరో చేసిన ఓ పొరపాటు వల్ల హీరోయిన్ అతన్ని అసహ్యించుకుంటుంది. తన జీవితమే మారిపోతుందని సీరియస్ అవుతుంది. కథానాయకుడు చేసిన ఆ తప్పేంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రంలో పృథ్వీ, పోసాని కృష్ణమురళి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మించారు. ఈ సినిమాకు కళ: బ్రహ్మ కడలి, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్,

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us