గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారు

డీజీపీ గౌతమ్ సవాంగ్

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 26 ఆక్టోబర్ 2021: మాదకద్రవ్యాల నియంత్రణపై ఏపీలో 45 మంది పోలీస్ ఉన్నతాధికార్లతో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాల మేరకు నెలరోజులుగా గంజాయిపై లోతైన అధ్యాయనం చేశామన్నారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆంధ్రా-ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉందని, ఎన్ఐఏ సహకారం తీసుకుని గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో 2లక్షల 90వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గత పదేళ్ల కంటే ఏడాదిలో కొన్ని రెట్లు అధికంగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us