Dharmavaram : ధర్మవరంలో ఉద్రిక్తత-బీజేపీ నాయకులపై వైసీపీ వర్గీయుల దాడి

UPDATED 28th JUNE 2022 TUESDAY 03:50 PM

Dharmavaram : సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్‌క్లబ్ లో ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులపై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గాయపడిన వారిని పోలీసులు మొదట ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం తీసుకువెళ్లారు. నిన్న నియోజక వర్గంలో జరిగిన వైసీపీ ప్లీనరీ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దర్మవరంలో బీజేపీ నాయకులపై దాడి ఘటన తెలుసుకుని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వరదాపురం సూరితో ఫోన్ లో మాట్లాడారు.

ఈ వ్యవహారం మొత్తానికి ఎమ్మెల్యేనే కారణం అని సోము వీర్రాజు ఆరోపించారు. ఈవిషయమై రాష్ట్ర డీఐజీ, ఎస్పీలతో ఆయన మట్లాడారు. దాడి చేస్తానని ముందుగానే ఎమ్మెల్యే ప్రకటించిన విషయాన్ని పోలీసులు దర్యాప్తు అంశంగా తీసుకోవాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి ఈవిషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని సోము డిమాండ్ చేశారు. ఈ తరహా ఘటనలు ప్రభుత్వం నిలువరించకపోతే బీజేపీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని వీర్రాజు హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వారిని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆస్పత్రిలో పరామర్శించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us