పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత

UPDATED 12th AUGUST 2018 SUNDAY 9:30 PM

గండేపల్లి: పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని ఆదిత్య డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో గల ఆదిత్య డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ విద్యార్థినీ, విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో ప్లాస్టిక్ రహిత సమాజంపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిత్య డైరెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్‌ సంచుల స్థానంలో జూట్‌ సంచులను  వాడాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్‌ వినియోగం పెరిగి 100 సంవత్సరాల కాలుష్యాన్ని కలిగించిందని, ఇది అణుయుద్ధం కన్నా ప్రమాదకరమన్నారు. ప్లాస్టిక్‌ వినియోగంతో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయని, ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే నియంత్రణ సాధ్యమని అన్నారు. వ్యర్థ పదార్థాల నిర్వహణకు ప్రణాళిక ఉండాలని, విద్యా విధానంలో పర్యావరణ పరిరక్షణ భాగం కావాలన్నారు. మానవాళిని టెర్రరిజం, పర్యావరణం పట్టి పీడిస్తున్నాయని, పెరుగుతున్న శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ విద్యార్థులు గ్రామ వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు ఇ. ప్రవీణ్, యన్. గోవర్ధన్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ సింగన అరవిందకుమార్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us