పేదప్రజల సౌకర్యం కోసమే కల్యాణ మండపాలు

UPDATED 15th APRIL 2018 SUNDAY 7:00 PM

ఏలేశ్వరం: పేద ప్రజలు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు జరుపుకునేందుకు కళ్యాణ మండపాలు నిర్మాణం ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో రూ. రెండు కోట్లుతో నిర్మించతలపెట్టిన కాపు కళ్యాణ మండపానికి, రూ. 20 లక్షలతో అంబేద్కర్ నగర్లో నిర్మించిన ఎస్.సి కమ్యూనిటీ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర గనుల శాఖామంత్రి వెంకట సుజియా కృష్ణరంగారావు, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, డిసిసిబి చైర్మన్ వరుపుల రాజా, స్థానిక శాసనసభ్యుడు వరుపుల సుబ్బారావుతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు వరుపుల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి మూడు సంవత్సరాలకు సంవత్సరానికి రూ.1000 కోట్లు చొప్పున నిధులు కేటాయించి కాపు కళ్యాణ మండపాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణ మండపంలో అన్నివర్గాలకు చెందిన ప్రజలు శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలతో పాటు కాపు కులస్తులు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు రూ.10 లక్షలు ఖర్చుచేయడం జరుగుతుందని తెలిపారు. పార్టీలకతీతంగా అర్హత కలిగిన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన పనులకు ఆర్థికపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని, కాపు రిజర్వేషన్ సంబందించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని తెలిపారు. గనుల శాఖామంత్రి వెంకట సుజియ కృష్ణరంగారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజన తరువాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ రూ. 4.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని, వీటిలో తూర్సు లక్ష్మీపురంలో నాబార్డ్ నిధులు రూ. కోటితో నిర్మిస్తున్న రోడ్డు, ఏలేశ్వరంలో రూ. కోటితో నిర్మిస్తున్న డిగ్రీ కళాశాల భవనానికి గనుల శాఖామంత్రి వెంకట సుజియా కృష్ణరంగారావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారని చెప్పారు. అలాగే లింగంపర్తిలో రూ. రెండు  కోట్లుతో కాపు కళ్యాణ మండపానికి ఉప ముఖ్యమంత్రి, గనులశాఖామంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్ తో కలిసి శంఖుస్థాపన జరిగిందని, అలాగే లింగంపర్తిలో అంబేద్కర్ నగర్లో రూ. 20 లక్షలతో నిర్మించిన వరుపుల ఎస్.సి కమ్యూనిటీ భవనాన్ని మంత్రులు ప్రారంభించడం జరిగిందని, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఇందిరా క్వారీ సొసైటీ మూసివేసిన క్వారీలను తెరిపించాలని గనుల శాఖామంత్రికి శాసనసభ్యుడు వరుపుల సుబ్బారావు సమక్షంలో విజ్ఞాపన పత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ వరుపుల సుబ్బారావు, నగర పంచాయతీ చైర్మన్ కె. పార్వతి, వైస్ చైర్మన్ పి. సత్యనారాయణ, పైలా సత్యనారాయణ, వరుపుల సూరిబాబు, ఎంపిపి ఐ. సత్యవతి, జెడ్పిటిసి జ్యోతుల పెదబాబు, వరుపుల చిట్టిబాబు, పర్వత రాజబాబు, ప్రత్తిపాడు ఎఎంసి చైర్మన్ కన్నబాబు, పెద్దాపురం ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, తహసీల్దార్ లక్ష్మీకళ్యాణి, ఎంపిడివో అనుపమ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిదులు, గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us