కోవిడ్ ఆసుపత్రుల సమాచారం ప్రజలకు తెలియచేయాలి

* జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి 

UPDATED 30th JULY 2020 THURSDAY 6:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో కోవిడ్ కేసుల చికిత్స నిమిత్తం నోటిఫై చేసిన ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రుల్లో  కోవిడ్, నాన్-కోవిడ్ రోగుల కోసం అందుబాటులో ఉన్న ఐసీయూ, ఆక్సిజన్ సపోర్ట్, జనరల్ పడకల వివరాలను ప్రతీ రెండు గంటలకు ఒకసారి ప్రజలందరికీ తెలిసేలా విధిగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో కోవిడ్ చికిత్స నిమిత్తం నోటిఫై చేసిన ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులు, ఐఎంఏ ప్రతినిధులతో గురువారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహింహరు. ఈ సమావేశంలో కోవిడ్ పాజిటీవ్ కేసులకు సత్వర చికిత్స అందించేందుకు అనుసరించాల్సిన చర్యలు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని నోటిఫైడ్ ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రుల్లో కోవిడ్, నాన్-కోవిడ్ కేసులకు ఓపి చికిత్సలు తప్పనిసరిగా అందించాలని, ప్రతీ ఆసుపత్రి కోవిడ్ పాజిటీవ్ వ్యక్తుల హెల్త్ కండిషన్, కో-మార్భిడ్ రోగాలు, లక్షణాల ఆధారంగా వారిని హోం ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్, ఆసుపత్రికి పంపే ప్రాధాన్యత పాటించాలని తెలిపారు. కోవిడ్ రోగులు, వారి సహాయకులకు సమాచారం అందించేందుకు ప్రతీ ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ లు నిర్వహించాలని సూచించారు. అన్ని ఆసుపత్రులలో అవసరమైన ప్రమాణంలో మందులు అందుబాటులో ఉంచి, సకాలంలో ఆహారం, త్రాగునీరు అందించాలని, అలాగే పారిశుధ్యంపై  ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అన్ని నోటిఫైడ్ ఆసుపత్రులకు రాపిడ్ యాంటిజెన్ కిట్స్ సరఫరా చేస్తామని, ఏ ఆసుపత్రిలో టెస్టులు, చికిత్సలకు నిర్ణయించిన ఫీజులకు మించి వసూలు చేయరాదని, రోగుల అడ్మిషన్, అందించిన సేవలు, కోలుకున్న వారి సంఖ్య, తదితర అంశాల ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కోవిడ్ రోగి మరణిస్తే మృతదేహాన్ని స్టెరిలైజ్ చేసి, సీల్ చేయాలని, కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ మున్సిపల్, పంచాయితీ అధికారుల సమన్వయంతో 24 గంటలలోపు మృతదేహాన్ని డిస్పోజ్ చేయాలని తెలిపారు. కోవిడ్ పాజిటీవ్ కేసుల చికిత్స అందించడంలో నోటిఫైడ్ ప్రయివేట్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి ప్రతినిధుల నుంచి తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు కీర్తి చేకూరి, జి. రాజకుమారి, డియంహెచ్ఓ డాక్టర్ మల్లిక్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్  రాఘవేంద్రరావు, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ వి. రవి, డాక్టర్ ఆనంద్, నోటిఫైడ్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us