AP News: పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్ నరసింహారావు నియామకం

గుంటూరు (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : పొగాకు బోర్డు సభ్యుడిగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు నియమితులయ్యారు. 14 డిసెంబరు 2021న రాజ్యసభలో ఆమోదించిన తీర్మానం మేరకు పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాజ్యసభ సెక్రటేరియట్ లిఖితపూర్వకంగా ఆయనకు తెలియజేసింది. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ... పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు చెప్పారు. పొగాకు ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రయత్నిస్తానని తెలిపారు. లోకసభ నుంచి పొగాకు బోర్డు ప్రతినిధులుగా బండి సంజయ్ (తెలంగాణ) వి.బాలశౌరి (ఏపీ) ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us