జనసేనను గెలిపించాలి

UPDATED 27th MARCH 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని, ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి తుమ్మల రామస్వామి (బాబు) సతీమణి తుమ్మల శ్రీదేవి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సామర్లకోట పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆమె బుధవారం విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అవినీతిరహిత పాలన అందించాలంటే ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని, నిత్యం ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నజనసేన పార్టీ అభ్యర్థి తుమ్మల రామస్వామి అని అన్నారు. అవినీతి రహిత రాజకీయం చేయాలంటే జనసేన పార్టీతోనే సాధ్యమని, ప్రజలు ఈ సత్యాన్ని గుర్తించి జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మార్పు చాలా అవసరమని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్టా జానకిరామారావు, దాసరి సుబ్బు, వడ్డాది దుర్గాదేవి, తుమ్మల ప్రసాద్, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us