కిక్ బాక్సింగ్ లో ఆదిత్య విద్యార్థికి గోల్డ్ మెడల్

UPDATED 22nd OCTOBER 2018 MONDAY 5:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన పి. సాయి శివ ప్రశాంత్ రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్  సాధించినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ప్రపంచ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ అనకాపల్లిలోని అంబేద్కర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ 60-70కేజీల విభాగంలో విశేష ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడని అన్నారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన పోటీలో పాల్గొని రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థికి శిక్షణ ఇచ్చిన కోచ్ డేవిడ్ సుధీర్ ను ఆదిత్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, తదితరులు అభినందించారు.  
  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us