స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ కలెక్టర్, ఎస్పీలతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాలు, పోలింగ్‌ అధికారులు, సిబ్బంది ఏర్పాటు, నోటిఫికేషన్‌ జారీ, నామపత్రాల స్వీకరణ, పరిశీలన, పోలింగ్, లెక్కింపు అంశాలపై  సూచనలు చేశారు. జిల్లాలో ఎన్నిక నిర్వహణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ హరికిరణ్, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వివరించారు. తర్వాత కలెక్టర్‌.. జడ్పీ సీఈవో, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. జేసీ కీర్తి, డీఆర్వో సత్తిబాబు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us