రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోంది : ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం,21 మే 2020 (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రజలను మోసం చేసి వైసీపీ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ అధిష్టానం అదేశాలమేరకు విద్యుత్ బిల్లుల పెంపునకు నిరసనగా చేపట్టిన దీక్షలో ఆయన గురువారం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్యాయమే జరుగుతోందన్నారు. అధికారం చేపట్టి ఏడాది గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, అలాగే కార్పొరేషన్ రుణాలు మంజూరుపై నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా విదేశీ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బ్రాహ్మణ,బీసీ,కాపు,ఎస్సీ తదితర కార్పొరేషన్లకు రుణాలు మంజూరు చేయకపోవడంతో ఆయా వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే మూడు నెలల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని,విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మరింత భారం మోపడం దారుణమన్నారు. లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేక విలవిలాడుతున్న సమయంలో విద్యుత్ బిల్లులు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాత శ్లాబ్ విధానాన్ని కొనసాగించి, పెంచిన బిల్లులను వెంటనే తగ్గించాలని, అలాగే మూడు నెలల కరెంట్ చార్జీలను ప్రభుత్వం మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రమంతటా విద్యుత్ కాంతులు వెదజల్లాయని, జగన్ పాలనలో రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయన్నారు. మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి, ఇప్పుడు మాట తప్పారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అన్నారు. ఈకార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కొత్తిం వెంకట శ్రీనివాసరావు (కోటి), గుడా మాజీ డైరెక్టర్ ఎలిశెట్టి నాని, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఆచంట రాజబాబు, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనే రామారావు, సామర్లకోట ఏఎంసీ చైర్మన్ పాలకుర్తి శ్రీనుబాబు, పాలచర్ల ఉమామహేశ్వరరావు (బుజ్జి) తదితరులు పాల్గొన్నారు..
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us