Sitharaman: 'యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందం యూపీఏ ప్రభుత్వ అవినీతికి నిదర్శనం'

■ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: యాంత్రిక్స్-దేవాస్ కేసుపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వాగతించారు. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు సమగ్రంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాన్ని యూపీఏ ప్రభుత్వం 2011లోనే రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదొక తప్పుడు ఒప్పందం అని తెలిపారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. ఒప్పందం పూర్తిగా అవినీతితో కూడుకున్నదంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వంపై సీతారామన్ విరుచుకుపడ్డారు. ఈ ఒప్పందం యావత్ దేశం పై జరిగిన మోసంగా అభివర్ణించారు. యాంత్రిక్స్ తో కుదిరిన ఒప్పందంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో దేవాస్ మల్టీమీడియా మూసివేయాలని ఎన్‌సీఎన్ఏటీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలుచేసింది. మోసపూరిత చర్యల వల్ల దేవాస్, దాని వాటాదారులు లబ్ధి పొందేందుకు అనుమతిస్తే సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us