ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

UPDATED 13th MARCH 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచేలా ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని నిమ్మకాయల రంగనాగ్ అన్నారు. సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. హుస్సేన్ పురం టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచారంలో నిమ్మకాయల రంగనాగ్ తో పాటు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా బుజ్జి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు తెలుగుదేశం  ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ప్రతీ గ్రామానికి సీసీ, తారురోడ్లు వేసిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే అని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రతీ ఇంటికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క కార్యకర్తపై ఉందని, పార్టీ విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు గుమ్మల రామకృష్ణ, చల్లా బుజ్జి యూత్ సభ్యుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురికి రంగనాగ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us