అగ్నిమాపక కేంద్రాల అభివృద్ధికి రూ.28 కోట్లు : హోంమంత్రి సుచరిత

కాకినాడ,22 మే 2020 (రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 29 అగ్ని మాపక కేంద్రాలకు కావల్సిన రూ.28 కోట్ల నిధులు త్వరలో విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖా మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. స్థానిక రామారావు పేటలో రూ. కోటితో నూతనంగా నిర్మించిన జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని ఆమె ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్,మంత్రి పినిపే విశ్వరూప్,ఎంపీ వంగా గీత,కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ విపత్తుల సమయాలలో విశిష్ట సేవలందిస్తున్న అగ్నిమాపక సిబ్బంది శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో అగ్నిమాపక కేంద్రాలు బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 175 ఫైర్ స్టేషన్లు, 3500 మంది సిబ్బంది కోవిడ్-19 సమయంలో విశిష్ట సేవలందిస్తున్నారన్నారు. నెల్లూరు అగ్ని ప్రమాదం సమయంలో ఇద్దరు ఫైర్ సిబ్బంది కరోన బారిన పడ్డారన్నారు. ప్రాణాలకు తెగించి, విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సూచనలతో పని చేస్తున్న పోలీస్, ఫైర్, వైద్యులు,పారిశుధ్య కార్మికులు, రెవెన్యూ, మీడియా పని తీరును ఆమె ప్రశంసించారు. దేశంలోనే అత్యధికంగా కరోన టెస్టులు చేసిన ఘనత మన రాష్ట్రానికే దక్కిందన్నారు. ఇదే సమయంలో సున్నా వడ్డీకి రూ. 1400 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు అందించడం ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనమన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం క్రింద పాత బకాయిలు పూర్తిగా చెల్లించడం జరిగిందన్నారు. ప్రతీ సంవత్సరం మే నెలలోనే వైయస్ఆర్ రైతు భరోసా క్రింద పెట్టుబడి నిధి రైతాంగానికి అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి దక్కుతుందన్నారు. నవరత్నాలతో పాటు, వివిధ సంక్షేమ పథకాలను ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. తక్కువ సమయంలో పూర్తి నాణ్యతా ప్రమాణాలతో కాకినాడలో రూ. కోటి రూపాయలతో నిర్మించిన జిల్లా అగ్నిమాపక కార్యాలయం మాదిరిగా మరిన్ని అగ్ని మాపక భవనాల నిర్మాణానికి సహకారం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అగ్ని మాపకశాఖ డీజీ ఎ.ఆర్.అనురాధ రాష్ట్రంలో అగ్ని మాపక శాఖ పనితీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ప్రాంతీయ అగ్ని మాపక అధికారి జి.శ్రీనివాసులు, డీయఫ్వో సిహెచ్.రత్నబాబులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us