వైభవంగా శృంగారవల్లభస్వామి కళ్యాణం

Updated 7th April, 2017, Friday, 11:30Pm

పెద్దాపురం: మండలంలోని తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ భూదేవీ సమేత శృంగార వల్లభ స్వామి దివ్య కళ్యాణం జరిగింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారి దివ్య కళ్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. దేవస్థానం చైర్మన్ బందిలి సుబ్రహ్మణ్యేశ్వరావు, కార్యనిర్వహాణాధికారి ఎం. రాంబాబురెడ్డి,  ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.స్వామివారికి పట్టు వస్త్రాలు, సుంగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామి వారు ప్రత్యేక అలంకరణ లో భక్తులకు   దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం కళ్యాణమహోత్సవాన్నిఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి గోపాలాచార్యులు పర్యవేక్షణ లో వైభవం గా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి, పాలక వర్గం సభ్యులు, ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, బాబ్జి, ఆలయ ధర్మకర్తలు మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.           

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us